పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ, తిరుమలకి తెలంగాణ నుండి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారి దర్శనం కోసం ప్రత్యేక కేటాయింపులు, సదుపాయాలు అవసరమని సూచించారు. భక్తులకు వెయ్యి నెంబర్ల కోటాను పెంచడం, ప్రత్యేక దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో సహకరించి, భక్తుల సౌకర్యం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు.