సహాయం కోసం వచ్చిన క్యాన్సర్ బాలుడిని కన్నెత్తి చూడని సీఎం
సీఎం కోసం ఆరుగంటలుగా వర్షంలో వేచిఉన్న క్యాన్సర్ భాధితబాలుడు
సీఎం సార్ హెల్ప్ మీ’ అని ప్లేకార్డ్ చూపుతూ కేకలు వేసిన ఫలితం శూన్యం
కనికరించని పోలీసుల అంటు జనం విమర్శలు
వరంగల్ జిల్లా: నగరానికి చెందిన సుమారు ఎనిమిది సంవత్సరాల బాలుడు మూడు సంవత్సరాలుగా బోన్ మ్యారో తో భాధపడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాపర్యటనకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని సహాయం కోసం బాలుడు అతని తండ్రి మధ్యాహ్నం 12.30 లకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ లోకి పోలీసులు అనుమతించకపోవడంతో మధ్యాహ్నం 3.30గంటల వరకు వారు గేట్ ముందే వేచిఉన్నారు. ముఖ్యమంత్రి కలెక్టరేట్ కు వ అనంతరం బాలుడిని అతని తండ్రిని లోపలికి అనుమతించారు. కానీ వీరు లోపలికి వెళ్లినకూడా పోలీసులు సమావేశం జరుగుతున్న మీటింగ్ హాల్ లోకి వెళ్లకుండా వీరిని అడ్డుకున్నారు. బాలుడు క్యాన్సర్ పేషంట్ అని, లోపలికి అనుమతించాలని ఎంత ప్రాధేయపడిన పోలీసులు కనికరించలేదు. చేసేదేమిలేక బాలుడు ‘సీఎం సార్ ప్లీజ్ హెల్ప్ మీ’ అని ప్లే కార్డు చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేవరకు అలానే జనంలో నిలుచున్నారు. సాయంత్రం సుమారు 6గంటల సమయంలో
సీఎం మీటింగ్ హాల్ నుండి వెళ్లిపోతున్న సమయంలో బాలుడు ప్లేకార్డు చూపిస్తూ ‘సీఎం సార్.. సీఎం సార్ హెల్ప్ మీ హెల్ప్ మీ.. అని గట్టిగా
కేకలు వేసిన ఫలితం లేకుండా పోయింది.
సీఎం రేవంత్ రెడ్డి బస్సు ఎక్కి వెళ్లిపోయారు.
వర్షంలో తడుస్తూ నిలుచున్న బాలుడిని చూసి అందరు భాధపడ్డారు.
పోలీసులు కొద్దిగా మానవతా ధృక్పదంతో కనికరించి బాలుడిని
ముఖ్యమంత్రికి వద్దకు తీసుకెళ్తే ముఖ్యమంత్రి సహాయం చేసేవారు కదా అని అక్కడున్న వారు అనుకున్నారు.