విజయవంతంగా సాగుతున్న సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారులు వికారాబాద్, సంగారెడ్డిలో ఉత్సాహభరితంగా కొనసాగిన టార్చ్ రిలే ర్యాలీ,కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కొనసాగనున్న టార్చ్ రిలే.
గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 సన్నాహకాలలో భాగంగా, నిన్న ఎల్.బి. స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన టార్చ్ రిలే ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో విజయవంతంగా ర్యాలీని పూర్తిచేసి, సంగారెడ్డిలో క్రీడాకారుల సంబరాల మధ్య కొనసాగింది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని టార్చ్ రిలేను ప్రారంభించారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ టార్చ్ రిలే కార్యక్రమంలో, పెద్ద సంఖ్యలో పోలీసు ట్రైనీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ నిర్వహణలో పీఈటీలు, పోలీసు సిబ్బంది, క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
శనివారం నాడు, కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల్లో ఈ టార్చ్ రిలే కొనసాగుతుంది.