Naga Chaitanya, Sobhita Dhulipala: నాగ చైతన్య మరియు శోభిత నిశ్చితార్ధం ఫోటోల్ని షేర్ చేసిన నాగార్జున

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగ చైతన్య రెండో వివాహానికి అక్కినేని కుటుంబం సిద్ధమవుతోంది. ఈమేరకు గురువారం, ఆగస్టు 8న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చిన నాగార్జున, గురువారం ఉదయం నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగినట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లో సన్నిహితుల మధ్య సాదాసీదాగా జరిగింది. అయితే, వచ్చే ఏడాది వీరి వివాహం ఘనంగా జరగనుందని తెలుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న నాగ చైతన్య, శోభితల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.