MSME పాలసీ-2024 ఆవిష్కరణ: ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి MSMEలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర సంపదను పెంపొందించడానికి MSME పాలసీ-2024ను ఆవిష్కరించాం.

పీవీ నరసింహారావు గారి ఆర్థిక దూరదృష్టి వల్ల భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది.

పారిశ్రామిక విధానంలో సరళీకరణలు తీసుకొచ్చి, ప్రపంచంతో పోటీ పడేలా మార్పులు చేశారు.

MSMEలను ప్రోత్సహించడంలో మంత్రి శ్రీధర్ బాబు మంచి ఆలోచనలు చేశారు.

పాలసీ డాక్యుమెంట్ లేకుండా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు.

గత ప్రభుత్వాల పనులను కొనసాగిస్తూ, కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్తాం.అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు; మంచి పనులను ఎవరూ చేసినా కొనసాగిస్తాం.పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడానికి 65 ఐటీఐలను ఆధునీకరించాం.టాటా ఇనిస్టిట్యూట్‌తో సంయుక్తంగా రూ. 2400 కోట్లతో ఆధునీకరణ.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం.యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తల సహకారంతో కార్పస్ ఫండ్ ఏర్పాటు.

రైతు కుటుంబాలకు వ్యవసాయం ద్వారా సంపాదన సరిగా ఉండడం లేదు, అయినా వ్యవసాయం మన సంస్కృతి.

హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం.

ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా వంటి పరిశ్రమలు స్థాపించబోతున్నాం.

మూసీ నది పునరుద్ధరణ ద్వారా దానిని మ్యాన్ మేడ్ వండర్‌గా మార్చబోతున్నాం.

మా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుంది.

స్వయంసహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉత్సాహం.

MSMEలను బలపరిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

MSMEలకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం