మరో సూర్యుడు – బొల్లా శ్రీకాంత్

మచిలీపట్నం జిల్లా సీతారామపురం గ్రామంలో 1992 జూలై 7న బొల్లా శ్రీకాంత్ జన్మించారు. ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు. ఎందుకంటే శ్రీకాంత్ రెండు కళ్లతో కనిపించకుండా పుట్టాడు. ఆ గ్రామస్తులు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో సలహాలు ఇచ్చారు, కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనను ప్రేమతో చూసుకున్నారు. “మేము ఉన్నంతవరకు ఈ పిల్లవాడిని బాగా చూసుకుంటాం” అని చెప్పేవారు.

కళ్లకు చూపు లేకపోయినా, శ్రీకాంత్ చదువులో చురుకుగా ఉండేవాడు. ఇంటర్మీడియెట్ చదువులో కాలేజీలు సీటు ఇవ్వడానికి నిరాకరించగా, కోర్టుకెళ్లి విజయం సాధించాడు. అయినప్పటికీ తోటి విద్యార్థుల ఎగతాళి భరించలేక, రెండు సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోయాడు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా పిల్లల కోసం ఉన్న పాఠశాలలో చేరాడు. అక్కడ కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, ఒక టీచర్ సాయం చేసి అతనికి ఆడియో టేపుల ద్వారా పాఠాలు వినిపించారు.

ఇంటర్మీడియెట్‌లో MPC గ్రూప్‌లో 98% మార్కులు సాధించాడు. IIT సీటు ఇవ్వకుండా నిరాకరించగా, అమెరికా యూనివర్శిటీలకు పరీక్షలు రాశాడు. స్టాన్‌ఫోర్డ్ సహా మరో రెండు యూనివర్శిటీల్లో ప్రవేశం పొందాడు. హార్వర్డ్ మరియు MITలో Brain Cognitive Sciences చదివిన తొలి అంధుడిగా రికార్డు సాధించాడు. అతని ప్రతిభ చూసి నాలుగు అమెరికన్ కంపెనీలు ఉద్యోగం ఆఫర్ చేయగా, అతను వీటిని సున్నితంగా నిరాకరించాడు.

తిరిగి భారతదేశానికి వచ్చి, హైదరాబాద్ సమీపంలో బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించాలని భావించగా, రతన్ టాటా ఫండ్స్ ఇచ్చారు. ఈరోజు బొల్లాంట్ ఇండస్ట్రీస్ 150 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీ. ఆ కంపెనీ CEO శ్రీకాంత్. అబ్దుల్ కలాం గారు కూడా ఆ కంపెనీని సందర్శించి, ఇద్దరూ కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా 4 లక్షల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ దగ్గర సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులకు చదువు అందిస్తున్నారు.

శభాష్ శ్రీకాంత్!