100వ శతజయంతి సందర్భంగా అర్గుల్ రాజారాం గారికి నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం: గోర్త రాజేంధర్, మాజీ జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు

నిజమాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో జన్మించి నిజమాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం నింపిన మహనీయుడు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రిగా చెరగని ముద్ర వేసిన మన రైతు బిడ్డ నిజమాబాద్ జిల్లాతో పాటు అనేక జిల్లాలలో కరెంటు మంత్రిగా పేరుగాంచిన మాజీ మంత్రి వర్యులు శ్రీ అర్గుల్ రాజారాం గారి 100 సంవత్సరాల శతజయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తిని మరియు ఆయన ఆశయ సాధనను సాధిద్దాం అంటూ నివాళులర్పిస్తున్న మాజీ జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు గోర్త రాజేంధర్ గారు.