హైదరాబాద్ వర్షాలతో ఏర్పడిన నష్టం మరియు వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది.
ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, డీజీపీ జితేందర్ గారు, మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్ష సమావేశంలో వరదల కారణంగా జరిగిన నష్టం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, సహాయక చర్యలు వేగవంతం చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు.