సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ బ్యూరో చీఫ్ నారాయణ గారి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నారాయణ గారి ఆకస్మిక మృతి చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాను,” అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు.