సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన: వేదిక ఏర్పాట్లు పరిశీలన & రైతులతో మూసి పునర్జీవన

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా సభా స్థలం ఏర్పాట్లను పరిశీలించిన వారిలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ శ్రీ హనమంత రావు, డీసీపీ రాజేష్ చంద్ర గార్లు ఉన్నారు.

ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు.

తరువాత, భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసి వంతెన వద్ద రైతులతో సమావేశం కానున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో రైతులతో మూసి పునర్జీవన ప్రాధాన్యతపై చర్చించనున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, అధికారులు మరియు మరెన్నో ప్రముఖులు పాల్గొన్నారు.