సచివాలయంలో మీడియా సమావేశంలోపొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖరవాణా శాఖ లో రెండు మూడు సంస్కరణలు తేవడం జరిగింది.మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తుంది..
ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కి ఇబ్బంది వస్తుండడం తో క్షేత్ర స్థాయిలో ఆర్టీవో డీటీవో లతో సమావేశ్న్ని ఏర్పాటు చేసితెలంగాణా లో కూడా సారథి ఈ వాహన పోర్టల్ లో చేరుతున్నాం..జీవో 28 ద్వారా ఇది అమలు చేస్తున్నాం..
రాష్ట్రం లో ,దేశంలో వాహనాలకు సంబంధించి 15 సంవత్సరాలు మనం వాడే వాహనాలు , 8 సంవత్సరాలు ప్రైవేట్ వాహనాలు స్క్రాపింగ్ పాలసీ తీసుకురావడం జరిగింది..ప్రస్తుత పరిస్థితుల్లో వాహన ఓనర్ మార్పిడి చేసుకోవడానికి ఉంది..కర్ణాటక ,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీ లు అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసే దానిపై జీవో తీసుకొచ్చాం..వాహనాల చెకింగ్ సరైన విధానం అమలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం తో సంప్రదించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ తీసుకొస్తున్నాం..
ఒక్కో సెంటర్ కి 8 కోట్లు ఖర్చు అవుతుంది.. రాష్ట్రంలో 32 సెంటర్లు తీసుకొస్తున్నాం..తెలంగాణ లో ఉన్న వాహనదారులు పొల్యూషన్ , పిట్నెస్ తదితర వాటిపై అమలు అయ్యేదానిపై చర్చ..దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు..
మన రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు పై ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తున్నాం..
రోడ్డు భద్రతా పై యునిసెఫ్ సహకారం తీసుకుంటున్నాం..ప్రతి పాఠశాల లో రోడ్డు సేఫ్టీ పై అవగాహన కలిస్తున్నం..వచ్చే నెలలో రోడ్డు సేఫ్టీ మంత్ ఉంది..సిగ్నల్ ,జీబ్రా క్రాసింగ్ తదితర అంశాల పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం..
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాం..ఇప్పటి వరకు 8 వేల లైసెన్స్ లు రద్దు చేయబడ్డాయి..ప్రాణం పోతుంది.. ప్రాణం నుండి రక్షించుకోవడానికి సుప్రీం కోర్టు నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం..
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉండదు..వాహనాలు కొనుక్కున్న వారి పేరు మీద నమోదు చేసుకునే అవకాశం ఉండదు..ప్రాణ నష్టాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం చిన్న పిల్లల స్థాయి నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి..ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వ వాహనాలు ,ఆర్టీసి బస్సులు, టూ విలర్స్,ఫోర్ వీలర్స్ వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.కొత్తగా 113 మంది వెహికిల్ ఇన్స్పెక్టర్ నియామకాలు పూర్తి చేసుకొని విధుల్లోకి రాబోతున్నారు..వారిని మరింతగా ఉపయోగించుకుంటాం..
ఆర్టీసి లో mvi రూల్స్ అమలు అవుతున్నాయి.ఎక్కడ ఇబ్బంది లేదు..Ghmc లొ ఉన్న వాహనాలు అయినా ఏదైనా రూల్స్ పాటించాల్సిందే..ప్రభుత్వ వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయి..ఇరు రాష్ట్రాలకు సంబంధించిన రవాణా శాఖ అంశాలు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తారు..
TS నుండి Tg కి మారినప్పుడు.. ts వాహనాలు మళ్లీ Tg గా మారుతాయని చెప్పలేదు.. కొత్త వాహనాలు Tg గా వస్తున్నాయి..నిబంధనలు ఉల్లగించి వాహనాలు లైసెన్స్ రద్దు అయితే వాళ్ళు వాహనాలు కొనడానికి ఉండదు..వాహనాలు నడపడానికి ఉండదు..మా డిపార్ట్మెంట్ నుండే కాకుండా యూనిసెఫ్ వారితో కూడా అవగాహన కల్పిస్తున్నాం.