మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్రిక ప్రకటన

తేదీ: 30.08.2024

ఈ రోజు మరో 7 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.

ఇప్పటి వరకు మొత్తం 39 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేశామని తెలిపారు – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలో కొత్త పాలకవర్గాలను నియమిస్తామని” ప్రకటించారు. ఆయన నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

ఈ రోజు, మహబూబ్ నగర్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 7 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, మరియు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

వీటిలో:

  • మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా బెక్కరి అనితారెడ్డి గారు, వైస్ చైర్ పర్సన్‌గా గడుగు విజయ్ కుమార్ గారు
  • వెలగటూరు మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా గుండటి గోపిక గారు, వైస్ చైర్ పర్సన్‌గా గొల్ల తిరుపతి గారు
  • గాంధరి మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా బండారి పరమేశ్వర్ గారు, వైస్ చైర్ పర్సన్‌గా ఆకుల లక్ష్మణ్ గారు
  • సదాశివనగర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా మాలోతు సంగ్య గారు, వైస్ చైర్ పర్సన్‌గా జక్కుల రాజారెడ్డి గారు
  • ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా మారెడ్డి రజిత గారు, వైస్ చైర్ పర్సన్‌గా జొన్నల రాజు గారు
  • నేలకొండపల్లి మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా వెన్నపూసల సీతరాములు గారు, వైస్ చైర్ పర్సన్‌గా కొండపర్తి సురేష్ గారు
  • మద్దులపల్లి మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్‌గా బైరు హరినాథ బాబు గారు, వైస్ చైర్ పర్సన్‌గా వనవాసం నరేందర్ రెడ్డి గారు నియమితులయ్యారు.