పాలమూరులో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు: ఎత్తిపోతల పథకం పనులకు వేగం

పాలమూరులో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు: వేగవంతమైన పనులతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుండి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తిచేయాలని, ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తిచేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించడం ద్వారా, వలసల సమస్యతోపాటు రైతుల సేద్య సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

మంత్రివర్గ సమీక్షలో ర్యాలంపాడు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని నాలుగు టీ.యం.సి లుగా పెంచాలని, అలాగే గట్టు ఎత్తిపోతల సామర్ధ్యాన్ని 10 నుండి 20 టి.యం.సి లకు పెంచే యోచనలో ఉన్నామని మంత్రి తెలిపారు.

మానవతా దృక్పథంతో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబోతోందని, ముంపు ప్రాంత ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం దృఢంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు.