ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, భూపాలపల్లి మంజూరునగర్‌లోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజాసేవలో ప్రజాపాలన ప్రాధాన్యత గురించి తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై వివరించారు.