ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫుల్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం ఇష్టమొచ్చినట్లుగా అసభ్య పదజాలంతో దూషించడంపై కౌశిక్ మీడియాతో మాట్లాడారు. దానంకు సీఎం రేవంతే మైక్ ఇప్పించి మాట్లాడించారంటూ ఆరోపించారు కౌశిక్. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే దానం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు:
“దానం, నువ్వు టీ షర్టు వేసుకుని పౌడర్ కొట్టుకుని తాజ్ కృష్ణలో తిరిగినట్టు.. ఇండోర్ గేమ్స్ ఆడినట్టు అనుకుంటున్నావా?” అని ఫైరయ్యారు.
“హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నా, ఎక్కడికి రమ్మంటావో చెప్పు,” అంటూ సవాలు విసిరారు.
“లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా?” అని ప్రశ్నించారు.
“దానం, నువ్వు ఎమ్మెల్యే పదవికి సిగ్గుంటే రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేశారు.