కుల గణన పారదర్శకతతో సమానత్వం సాధ్యం: ప్రొఫెసర్ కోదండరాం

కుల గణనను స్వాగతిస్తున్నాం: ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కుల గణనను హర్షంగా స్వాగతించారు. కుల గణన ప్రక్రియ పారదర్శకంగా కొనసాగి, దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలులోకి రావాలని సూచించారు. “గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదు?” అని ప్రశ్నించిన ఆయన, అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం తప్ప ప్రభుత్వం పట్ల విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.